చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నూతనంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డిలు మంగళవారం శంకుస్థాపనలు చేయనున్నారు. తారానగర్‌లోని శ్రీటవర్స్ నుంచి నాలా వరకు రూ.39.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న వరద నీలి కాలువ నిర్మాణ పనులకు, జవహర్ నగర్‌లోని పలు ప్రాంతాల్లో రూ.96.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, వీడీసీసీ రోడ్లు, వరదనీటి కాలువ నిర్మాణ పనులకు, విద్యానగర్, అర్జున్‌రెడ్డి కాలనీల్లోని పలు ప్రాంతాల్లో రూ.48.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు వారు శంకుస్థాపనలు చేశారు. మొత్తం రూ.1 కోటి 85 లక్షల 10వేల అంచనా వ్యయంతో ఆయా నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.
