శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
కరోనా వ్యాధి నివారణకు కోసం వ్యాధి నిరోధక శక్తి నిచ్చే హోమియోపతి మందులను ఎల్ఐసీ ఉద్యోగులకు
సోమవారం మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల ప్రీతం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సూచించిన హోమియోపతి మందు ఆర్సెనికం ఆల్బమ్ 30 ని ప్రజలకు, ఉద్యోగస్తులకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రోగనిరోధక శక్తిని పెంచే హోమియోపతి మందులను ప్రతి ఒక్కరు వాడాలని ఆయన సూచించారు. హోమియోపతి మందుల ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ ఉద్యోగులు, టీఆర్ఎస్ నాయకుడు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.