క‌రోనా ఉన్నా అభివృద్ధి ఆగ‌లేదు: ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

మియాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): క‌రోనా లాంటి విప‌త్క‌ర స్థితిలోనూ ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసిన ఘ‌న‌త తెరాస ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. శ‌నివారం మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల్లో రూ.3.15 కోట్ల వ్యయంతో చేప‌ట్ట‌నున్న ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ఆయ‌న శంకుస్థాప‌నలు చేశారు.

అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

మయూరి నగర్ లో రూ.70 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనుల‌కు, నడిగడ్డ తండాలో రూ.40 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనుల‌కు, జేపీ నగర్ కాలనీలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనుల‌కు, కేకే ఎన్‌క్లేవ్ కాలనీలో రూ.45 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనుల‌కు, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో రూ.40 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనుల‌కు, కృషి నగర్ స్వర్ణపురి కాలనీలో రూ.40 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనుల‌కు, కృషి నగర్ నుండి ప్రశాంత్ నగర్ వ‌ర‌కు స్వర్ణపురి కాలనీలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గాంధీ శంకుస్థాపనలు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా రాష్ట్రంలో ఎక్క‌డా సంక్షేమం ఆగ‌లేద‌ని, అభివృద్ధి ప‌నులను కూడా కొన‌సాగించామ‌ని తెలిపారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల స‌హ‌కారంతో శేరిలింగంప‌ల్లిని అన్ని రంగాల్లోనూ నంబ‌ర్ వ‌న్‌గా తీర్చిదిద్దుతాన‌ని స్ప‌ష్టం చేశారు. శేరిలింగంప‌ల్లిని ఆద‌ర్శవంత‌మైన నియోజ‌క‌వ‌ర్గంగా మారుస్తాన‌న్నారు. అభివృద్ధి ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూడాల‌ని ఆయ‌న కాంట్రాక్ట‌ర్ల‌కు సూచించారు.

ఆరెక‌పూడి గాంధీని ఆశీర్వ‌దిస్తున్న మ‌హిళ

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు డీఈ రూపాదేవి, ఏఈలు రమేష్, ప్రశాంత్, వర్క్ ఇన్స్పెక్టర్లు శర్మ, విశ్వనాథ్, మల్లేష్, డివిజన్ తెరాస అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, హఫీజ్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు లక్ష్మా రెడ్డి, అన్వర్ షరీఫ్, బీఎస్ఎన్‌ కిరణ్ యాదవ్, మోహన్ ముదిరాజ్, మాధవరం గోపాల్, విద్యాసాగర్, శ్రీనివాస్ గోప‌రాజు, జహంగీర్, రాజు, మల్లేష్, స్వామి నాయక్, రోజా, కాలనీ వాసులు కిషోర్, దేవేందర్ రెడ్డి, అన్ని రాజు, రవి వర్మ, పద్మనాభన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here