శివచరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించాలని డిమాండ్

శేరిలింగంప‌ల్లి, జూలై 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాష్ట్ర యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఆయనను పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి బేరి రామచందర్ యాదవ్ నేతృత్వంలోని బీసీ సంఘాల ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. బీసీ వర్గానికి చెందిన ఈశ్వరమ్మ యాదవ్‌కు దేవస్థాన బోర్డు సభ్యురాలిగా అవకాశం రావడాన్ని కొందరు అగ్రవర్ణ నాయకులు జీర్ణించుకోలేక అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. శివచరణ్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా తెలంగాణ యాదవుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని పేర్కొన్న బేరి రామచందర్ యాదవ్, ఆయనను వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించి, ఈశ్వరమ్మ యాదవ్‌కు బహిరంగ క్షమాపణ చెప్పేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

bheribheribh

అలాగే ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఈ ఘటనపై వెంటనే స్పందించి ఖండించాలని, లేనిపక్షంలో తెలంగాణ యాదవుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేదరి మహేంద్ర సంఘం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు కొంటు ముకుందం, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ముఖ్య సలహాదారు పట్లూరి కృష్ణమోహన్, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ యాదవ్, పులి రాజేందర్, నోముల ప్రవీణ్ కుమార్, హరికృష్ణ చారి, ఎం.వి.ఎస్. నాయక్, శ్రీశైలం గౌడ్, కీర్తి కుమార్, కొంటు సుమన్, సిద్ధార్థ ముదిరాజ్, శీను పటేల్, మల్కాజిగిరి కాంటెస్ట్ ఎమ్మెల్యే మండలి రాధాకృష్ణ యాదవ్, నాగపురి అశోక్ యాదవ్, వంగూరి సందీప్ యాదవ్, రాజు గౌడ్, కృష్ణ ముదిరాజ్, సాయిలు, రమేష్, కిషోర్, అనంతయ్యతోపాటు పలువురు బీసీ, యాదవ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here