శేరిలింగంపల్లి, అక్టోబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికాం నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ లో 5 రూపాయలకే ఆల్ఫాహారం పథకంను జోనల్ కమిషనర్ హేమంత్ బొర్ఖడే, DC ప్రశాంతి, AMOH శ్రీకాంత్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఇందిరమ్మ క్యాంటీన్లలో రుచికరమైన అల్పాహారం కూడా అందుబాటులోకి రానుందని, పేదలు ఉదయం పూట ఆకలితో ఉండకూడదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగిదంన్నారు. ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్ వంటి అల్పాహారాలను ప్రజలకు అందించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో EE శిరీష, నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, కార్యకర్తలు, కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.






