గార్వి ఉత్స‌వాల్లో పాల్గొన్న బేరి రామచందర్ యాదవ్

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి బాపూనగర్ ఈద్గా రోడ్ వ‌ద్ద‌ బాపునగర్ టిప్పు సుల్తాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గార్వి వేడుక‌ల ఉత్స‌వాల్లో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విందు కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ గార్వి షరీఫ్ హజరత్ స‌య్య‌ద్‌ షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానిబ్ పిరానా- ఈ- పీర్ గౌస్- ఈ- అజాం దస్తగిర్ సందర్భంగా నిర్వహించిన ఈ గార్వి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇన్షా అల్లా అందరిని చల్లగా చూడాలని అందరూ బాగుండాలని అన్నారు. మతాల కతీతంగా ఈ గార్వి పండుగను చేసుకుంటారని అన్నారు. టిప్పు సుల్తాన్ అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గపూర్, ఫయాజ్,షేక్ ఆసిఫ్, సయ్యద్ ఖదీర్, మ‌హమ్మద్ ముక్రం, మ‌హమ్మద్ ఇర్ఫాన్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here