ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.. వోట్ చోరీని అడ్డుకుందాం: జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వోట్ చోరీ సంత‌కాల సేక‌ర‌ణ‌ కార్య‌క్ర‌మంలో పెద్ద ఎత్తున పాల్గొని సంతకాల‌ను సేక‌రించాల‌ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంఎల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వోట్ చోరీ సంత‌కాల సేక‌ర‌ణ‌పై స‌మావేశం నిర్వ‌హించారు. ఇందులో పాల్గొన్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజాస్వామ్య పరిరక్షణకు నిదర్శనంగా దేశవ్యాప్తంగా వోట్ చోరీ వ్య‌తిరేక‌ కార్యక్రమంను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోందని, అందులో భాగంగా తెలంగాణ‌ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని అన్నారు. ప్రతి ఓటు పవిత్రమైనదని, ప్రజల హక్కులను హరించే ఓటు చోరీ వంటి చర్యలను అరికట్టాలని పిలుపునిచ్చారు.

శ ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలంటే ఓటు హక్కు కాపాడబడాలని, ప్రతి పౌరుడు తన ఓటును స్వేచ్ఛగా వినియోగించే హక్కు కలిగి ఉన్నాడని, ప్రజల్లో అవగాహన కల్పించే ర్యాలీలు, చర్చావేదికలు, బహిరంగ సభల ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని, ప్రజల ఓటు విలువను మోసం చేసే ఏ చర్యకూ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేస్తుంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళా నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here