శేరిలింగంపల్లి, మార్చి 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న మెడికవర్ హాస్పిటల్స్ లో థర్డ్ వేవ్ కాఫీ షాప్ ను అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఇలాంటి ప్రీమియం కాఫీ సంస్కృతి అభివృద్ధి చెందడం అభినందనీయం అన్నారు. యువతకు, ఉద్యోగులకు విశ్రాంతి, సమావేశాల కోసం ఇలాంటి ప్రదేశాలు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ రెడ్డి పాల్గొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో నాణ్యమైన సేవలను అందించే సంస్థలు రావడం సంతోషకరమన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ పాల్గొని నిర్వాహకులను అభినందించారు. థర్డ్ వేవ్ కాఫీ షాప్ ప్రత్యేకతల గురించి నిర్వాహకులు వివరించుతూ అత్యాధునిక వాతావరణం, ప్రీమియం కాఫీ రకాలతో కస్టమర్లకు విభిన్నమైన అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆహ్వానితులు, ప్రముఖులు పాల్గొన్నారు.






