నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆద్వర్యంలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్‌సీఎస్‌సీ) ద్వారా కరోనా నియంత్రణ, రోగుల వైద్యం కోసం చేస్తున్న సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఎస్‌సీఎస్‌సీ ద్వారా కొనసాగుతున్న సేవా కార్యాక్రమాలకు తమ వంతు భాద్యతగా ఆర్థిక సహకారాన్ని అందించేందుకు పలు సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మీనాక్షీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున ట్రెడా ఉపాధ్యక్షుడు విజయ్‌సాయి మేక, దేవభూమి రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున సంస్థ ఫెసిలీటీస్ హెడ్ నాజర్ హుస్సేన్‌లు రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సహాయంను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ ఆయా సంస్థలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్‌సీఎస్‌సీ) సేవల్లో భాగస్వాములవ్వడం అభినందనీయమని, వారిని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఇలాంటి ప్రోత్సాహం లభిస్తే కోవిడ్ కష్టకాలంలో రెట్టింపు సేవలు అందించవచ్చని అన్నారు.







