నమస్త శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్‌రెడ్డి ఆద్వర్యంలో శనివారం చందానగర్‌లోని నిరుపేదలకు ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు తమ వంతు సహకారంగా భోజనం పంపిణీ చేశామని తెలిపారు. ఇలాంటి వారు గుర్తించిన వారు ఎక్కడకక్కడ వారికి తోచిన సహకారం అందించి మానవత్వాన్ని చాటుకోవాలని ఆయన పిలుపినిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవిందర్‌రెడ్డి, గురుచరణ్ దూబే, అక్భర్ ఖాన్, కృష్ణ దాస్ తదితరులు పాల్గొన్నారు.
