మియాపూర్‌లో రైఫ‌ల్‌తో కాల్చుకుని సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ ఆత్మ‌హ‌త్య‌… కుటుంబ క‌ల‌హాలే కార‌ణం..?

న‌మ‌స్తే శేరిలింగంపల్లి: డ్యూటీలో ఉన్న సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ త‌న రైఫల్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మియాపూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్ట‌ర్ సామ‌ల వెంక‌టేశ్ తెలిపిన వివరాల ప్ర‌కారం… గుజ‌రాత్ ప్రాంతానికి చెందిన శంక‌ర్ ఠాకూర్ 2016 నుంచి మియాపూర్ న‌డిగ‌డ్డ తండాలో ఉన్న సీఆర్‌పీఎఫ్ క్యాంపులో విధులు నిర్వ‌హిస్తున్నాడు. కాగా బుధ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల ప్రాంతంలో శంక‌ర్ ఠాకూర్ త‌న వ‌ద్ద ఉన్న‌ ఎస్ఎల్ఆర్ రైఫ‌ల్‌తో త‌న‌పై తానే ఫైర్ చేసుకున్నాడు. గొంతు భాగం నుంచి త‌ల‌లోపలికి తూటా దూసుకుపోవ‌డంతో శంక‌ర్ ఠాకూర్ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఐతే శంక‌ర్ ఠాకూర్ మృతికి కుటుంబ క‌ల‌హాలే కార‌ణం అయ్యి ఉండ‌వ‌చ్చ‌ని సీఆర్‌పీఎఫ్ ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు. శంక‌ర్‌ఠాకూర్‌కు అత‌ని భార్య‌కు మధ్య వివాదాలు ఉన్న‌ట్టు తెలిసింద‌ని, ఐతే ఆత్మ‌హ‌త్య‌కు చేసుకోవ‌డానికి నిజ‌మైన కార‌ణాల కోసం విచార‌ణ కొన‌సాగుతుంద‌ని అన్నారు.

శంక‌ర్ ఠాకూర్‌(ఫైల్‌)

 

Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here