నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ ఎస్టేట్ కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి ఆదర్శకాలనీగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గోల్డెన్ తులిప్ కాలనీ అసోసియేషన్ సభ్యులతో పలు సమస్యలు,చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల పై బుధవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గోల్డెన్ తులిప్ ఎస్టేట్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరించి సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాలనీలో ఉన్న పార్కును అహ్లాద వాతావరణంతో అన్ని హంగులు, సకల సౌకర్యాలతో అభివృద్ధి చేసి సుందరవనంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. పార్క్ లో ఇంకుడు గుంత ఏర్పాటు చేయడం పట్ల కాలనీ సభ్యులను అభినందించారు. కాలనీలో డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు, విద్యుత్ దీపాలు తదితర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. అనంతరం మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, కాలనీ సభ్యులతో కలిసి పార్కు ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డీఈ రమేష్,ఏఈ ప్రతాప్, తులిప్ ఎస్టేట్ కాలనీ అధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎస్ వి ఎన్ రాజు, కార్యదర్శి రేవతి, సంయుక్త కార్యదర్శి అమర్నాథ్ , కోశాధికారి బెనర్జీ , సభ్యులు రమాకాంత్, రాకేష్, పార్క్ కమిటీ, టెంపుల్ కమిటీ, ఉత్సవ, సాంస్కృతిక కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.