హెచ్‌సీయూలో గ‌ణేష్ మండ‌పం వ‌ద్ద కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి పూజ‌లు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 1 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బసుత్కర్ జగదీశ్వర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ విఘ్నాధిపతి వినాయకుని పూజించడం ద్వారా చేపట్టే పనుల్లో ఆటంకాలు తొలగి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయ‌ని అన్నారు. గ‌ణపతి నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు మట్టి విగ్రహాలతోనే పూజలు జరుపుకోవాల‌ని, పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాఘవేంద్ర, సాయి కిరణ్, ప్రణీత్, జయకర్, నవీన్, నిఖిల్, హేమంత్, తేజ, ప్రసాద్, వంశీ, నరేష్, జస్వంత్, మణికంఠ, రూపేష్, వినీత్, శ్రీను, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here