శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): గంగారం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన 700 గజాల కాంపౌండ్ వాల్ నిర్మించి ఉన్న స్థలాన్ని నకిలీ ఇంటి నంబబర్, డాక్యుమెంట్స్ సృష్టించి, హైకోర్టు జడ్జిమెంట్ ను డార్క్ లో ఉంచి బోర్డు పెట్టి అమ్మకానికి పెట్టారని జరిగిన తప్పు పై క్రిమినల్ దర్యాప్తుకు ఆదేశించాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో జైభీమ్ యూత్ అసోసియేషన్ సభ్యులు చందానగర్ డీసీకి ఫిర్యాదు చేశారు. కార్వాన్ నకిలీ ఇంటి నంబర్ తీసుకొని, నకిలీ కాగితాలు సృష్టించడంతో పాటు కోర్టును తప్పుదారి పట్టించడంపై, నకిలీ ఇంటి నంబర్ చందానగర్ ది కార్వాన్ లో తీసుకొని కబ్జా బోర్డు పెట్టి అమ్మకానికి మార్కెట్ లో పెట్టడంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిసీకి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జైభీమ్ యూత్ అసోసియేషన్ సభ్యులు పాండు, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.






