శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శిరీషతో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టవలసిన కొత్త కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని కార్పొరేటర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను కోరారు. గచ్చిబౌలి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఈ రషీద్, రంగారెడ్డి అర్బన్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






