లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప‌లు కాలనీల‌లో పలు గణేష్ నవరాత్రి మండపాల‌ నిర్వాహకుల ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమాల‌కి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.హైదరాబాద్ నగరంలో యువత అంతా ఐక్యంగా ఉండి ఘనంగా నిర్వహించే పండుగ వినాయక నవరాత్రి వేడుకలని, గణపయ్య నిమజ్జనం అనేది ముగింపు కాదని కొత్త ఆరంభానికి సంకేతమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక నేతలు, భక్తులు, మహిళలు, పిల్లలు, కాలనీ వాసులు, కార్యకర్తలు, గణేష్ మండపాల నిర్వాహకులు, గణేశ భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here