శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): నేతాజీ నగర్ లోని గల్లిక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జరిగిన లడ్డూ వేలంపాటలో గణేశుని లడ్డూను భారీ ధరకు కైవసం చేసుకున్నారు. మొదటి లడ్డూను గుంటి యాదగిరి సాగర్ రూ.2,10,000కు దక్కించుకోగా రెండవ లడ్డూను దయాకర్ సాగర్ రూ.1,08,000 కి కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు లడ్డూలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు.






