మయూరి నగర్ కాలనీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి అధికారులు, కాలనీవాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మయూరి నగర్ కాలనీలో ఉన్న సమస్యలను స్వయంగా పర్యటించి పరిశీలించడం జరిగింద‌ని, అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం జరిగిందని, మయూరి నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ సంతోష్, వర్క్ ఇన్స్పెక్టర్ అన్వర్, మయూరి నగర్ కాలనీ అధ్యక్షుడు కె రామరాజు, అసోసియేషన్ సభ్యులు కిషోర్, ప్రవీణ్ రెడ్డి, సోమేశ్వర్ రెడ్డి, కృష్ణ కుమార్, వెంకట్, రమణా రెడ్డి, జ‌హంగీర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here