వీ బీ జీ రాం జీ బిల్లుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాలి: గాదగోని రవి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారత పార్లమెంటులో డిసెంబర్ 18వ తేదీన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి వైదొలగి నిరంకుశంగా వ్యవహరిస్తూ బిల్లును ఆమోదించిన తీరుకు ప్రజలు, ప్రజాతంత్ర వాదులు ఎక్కడిక్కడ పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేయాలని యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ పేరు తో ఉన్న గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరు ను మార్చి వీ బీ జీ రాం జీ పేరు తో ఉపాధి బిల్లు ను పార్లమెంటు లో ప్రవేశ పెట్టింద‌న్నారు. గ‌తంలో 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించేది. కానీ కొత్త బిల్లు ప్రకారం 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40స శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఏ పనులు చేయవద్దని పేరుకు 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నట్లు బిల్లు లో పెట్టడం, పోరాడి సాధించిన ఉపాధి హామీ పథకం ను దురుద్దేశంతో రద్దు చేసే కుట్రతో కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టి పార్లమెంటు లో బిల్లు తీసుకుని వచ్చినపుడు అన్ని పార్టీలు ఈ బిల్లు ను జాయింట్ పార్లమెంటరీ కమిటీ కి గానీ, స్టాండింగ్ కమిటీ కి గానీ పరిశీలనకు పంపాలని కోరినప్పటికీ, ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోకుండా బిల్లు ను ఆమోదించిన తీరు కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను ఎలా నిర్వీర్యం చేయాలనే దృక్పథం తప్ప న్యాయం, ధర్మం, చట్టం ఏది పట్టించుకోవడం లేద‌న్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here