ట్రాఫిక్ రహిత సమాజం కోసం రాజీ లేని కృషి చేస్తాం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామారం వరకు చేపడుతున్న వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారి 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, GHMC ఇంజనీరింగ్ విభాగం, విద్యుత్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజుల రామారం వెళ్లే రోడ్డు వయా ఎల్లమ్మబండ రోడ్డు నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అని అన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 100 ఫీట్ రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగింద‌ని , దానిలో భాగంగా తీసుకోవాల్సిన చర్యల పై అధికారులు, కార్పొరేటర్ తో కలిసి చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE గోవర్ధన్, DE రమేష్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి , విద్యుత్ విభాగం అధికారులు ADE శ్యామ్, నాయకులు , కార్యకర్తలు , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here