శేరిలింగంపల్లి, నవంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని BK ఎన్క్లేవ్ కాలనీకి నూతనంగా ఎన్నుకోబడిన అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ BK కాలనీ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకో బడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలపడం జరిగిందని, BK ఎన్క్లేవ్ కాలనీ అసోసి యేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గసభ్యులు కాలనీ వాసులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పై స్పందిస్తూ ప్రతి ఒక్కరూ సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో BK ఎన్క్లేవ్ కాలనీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షురాలు పద్మ, కార్యవర్గసభ్యులు ధనుంజయ్, మోహన్ రెడ్డి, వాహిని, ప్రభుసింగ్, సదానందం లక్ష్మణ్, నాగేశ్వరావు, రాయల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






