శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని ఓల్డ్ లింగంపల్లి విలేజ్ లో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా మాత అమ్మవారిని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, SLVDC ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, పురం విష్ణువర్ధన్ రెడ్డి, గోవర్ధన్ గౌడ్, భాస్కర్ రెడ్డి, అఖిల్, వినయ్, రేవంత్ రాజ్ ముదిరాజ్, భరత్ గౌడ్, కిరణ్ యాదవ్, రేవంత్, సాయి గౌడ్, హనుమాన్ యూత్ అసోసియేషన్ మెంబర్స్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






