శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ ప్రభుపాద లే ఔట్ కాలనీలో ఉన్న వరద నీటి కాలువకు అడ్డుగా అపర్ణ కన్స్ట్రాక్షన్ వారు గోడ కట్టడం వలన వరద నీరు ప్రవాహం సరిగ్గా వెళ్లక కాలనీలు ముంపుకు గురవతున్నాయి. ఈ క్రమంలో సంఘటన స్థలాన్ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించి నాలా ప్రవాహానికి అడ్డుగా ఉన్న గోడ తొలగింపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కాలనీలో ఉన్న సమస్యను ఎట్టకేలకు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వర్షం పడిన ప్రతిసారి ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు చెప్పడంతో వెంటనే చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా తనకు తెలియజేస్తే వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారబోయిన రాజు యాదవ్ , ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చింతకింది రవీందర్ గౌడ్, కొడిచెర్ల రాములు తదితరులు పాల్గొన్నారు.






