శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): PM Surya Ghar Muft Bijili Yojana (PMSGMBY) సౌర విద్యుత్ వినియోగంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అందుబాటులోని వనరులను సద్వినియోగం చేసుకోవాలని ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా TGREDCO జిల్లా అధికారి పవన్ చందు, TGSPDCL Kukatpally AE చైతన్య, TGSPDCL ఆల్విన్ కాలనీ AE పీర్య నాయక్ అవగాహన సదస్సును నిర్వహించి స్కీం కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాలైన పియం సూర్య ఘర్ ముప్తా బిజిలి యోజన, పీఎం కుసుమ్ యోజన, బయోగ్యాస్, సోలార్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంలో భాగంగా సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. ఈ పథకం వలన గృహ వినియోగదారులకు అతి తక్కువ విద్యుత్ బిల్లు వస్తుందని తెలిపారు. దరఖాస్తుల కోసం www.pmsuryaghar.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో TGREDCO ఫీల్డ్ ఆఫీసర్ ఓంప్రకాష్ , TGSPDCL సిబ్బంది, కూకట్‌పల్లి వాసులు పాల్గొన్నారు.






