శేరిలింగంపల్లి, డిసెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన జిహెచ్ఎంసీ కాంగ్రెస్ కార్పొరేటర్ల ముఖ్య సమావేశంలో శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీ, ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్, రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ తదితర గౌరవ కార్పొరేటర్లతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సమావేశంలో పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ లో భాగంగా అభ్యర్థన కోరుతూ మేయర్, జిహెచ్ఎంసీ కమీషనర్ కర్ణన్ కి వినతిపత్రం అందజేశారు. మేయర్ సానుకూలంగా స్పందిస్తూ భవిష్యత్తు కార్యాచరణపై, విధివిధానాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.






