- వచ్చే ప్రతి ఎన్నికలో భారాసదే విజయం: రవీందర్ యాదవ్
శేరిలింగంపల్లి, అక్టోబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి యువనేత, భారాస పార్టీ సీనియర్ నాయకుడు రవీందర్ యాదవ్ కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావుల ఆశీస్సులను రవీందర్ యాదవ్ తీసుకున్నారు. అనంతరం కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న రవీందర్ యాదవ్ కు రానున్న రోజుల్లో మంచి అవకాశం లభిస్తుందని స్పష్టం చేశారు. శేరిలింగంపల్లిలో రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని సూచించినట్లుగా ఆయన వెల్లడించారు. కష్టపడిన కార్యకర్తలకు పార్టీ అవకాశం ఇస్తుందన్నారు. ఉద్యమకాలం నుంచి పార్టీ కోసం రవీందర్ యాదవ్ శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా పని చేసి విజయతీరాలకు చేర్చారని ప్రశంసించారు.

శేరిలింగంపల్లిలో పార్టీ బలోపేతం దిశగా మరింత కృషి చేయాలన్నారు. జన్మదినం సందర్భంగా కేటీఆర్, హరీష్ రావును కలిసిన రవీందర్ యాదవ్ కు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. భారాస పార్టీ ముఖ్య నేతలు సైతం శుభాకాంక్షలు తెలిపారు. రవీందర్ యాదవ్ శేరిలింగంపల్లిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణపై కేటీఆర్, హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులు తీసుకున్న రవీందర్ యాదవ్ కు ఈ సందర్భంగా మంచి భవిష్యత్ ఉందని సూచించారు. అనంతరం రవీందర్ యాదవ్ మాట్లాడుతూ వచ్చే ప్రతి ఎన్నికలో భారాసదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ సూచనలతో పార్టీ బలోపేతం దిశగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.






