శేరిలింగంపల్లి, నవంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికైన వల్లాల నవీన్ యాదవ్ కు గాను నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపి అనిల్ కుమార్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్, ఆర్ లక్ష్మణ్ యాదవ్, రవీందర్ యాదవ్, గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్, గడ్డం రవి యాదవ్, పాములేటి యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






