శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): నెహ్రూ నగర్ లోని వడ్డెర బస్తీలో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్ వడ్ఢెర బస్తీలో స్థానికులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర చేశారు. బస్తీలో సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. బస్తీ పక్కన ఉన్న నాలాను పరిశీలించి నాలా గోడ ఎత్తును పెంచేలా చూస్తామని రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు.
యూజీడీ, సీసీ రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్పొరేటర్ ఎదుట వాపోయారు. దశల వారీగా బస్తీలో యూజీడీ, సీసీ రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి అభివృద్ధి చేస్తామని రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు. ఆయన వెంట ఏఈ సునీల్, వార్డు మెంబర్ పర్వీన్ బేగం, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఉపాధ్యక్షుడు యాదాగౌడ్, నెహ్రూనగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్, గౌరవ అధ్యక్షుడు గఫర్, గోపీనగర్ బస్తీ కమిటీ గౌరవ అధ్యక్షుడు గోపాల్, నాయకులు కేఎన్ రాములు, మల్కయ్య, విజ్జన్న, వెంకన్న, మల్కయ్య, వర్క్ ఇన్ స్పెక్టర్ యాదగిరి ఉన్నారు.