మియాపూర్‌లో ఆంజనేయస్వామి ఆలయ 15వ వార్షికోత్సవం

శేరిలింగంపల్లి, అక్టోబర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో విజయ వినాయక యూత్ అసోసియేషన్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంజనేయస్వామి దేవాలయ 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ హఫీజ్‌పేట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనుషా మహేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆంజనేయస్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు సేవలందించారు.

ఈ సందర్భంగా బోయిని అనుషా మహేష్ యాదవ్ మాట్లాడుతూ.. భక్తి, సేవాభావం, ఐకమత్యానికి ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంతోపాటు, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్య సోదరభావం, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన విజయ వినాయక యూత్ అసోసియేషన్ నిర్వాహకులకు, ఆలయ కమిటీ సభ్యులకు ఆమె అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోయిని కిషోర్ యాదవ్, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, విజేందర్, పవన్, లక్ష్మణ్, సాయి యాదవ్‌తోపాటు పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here