శేరిలింగంపల్లి, అక్టోబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): జాతీయ పార్టీ ఆదేశాల మేరకు యువ సంవాద్ కార్యక్రమానికి ఇంచార్జిగా నియమితులైన భారతీయ జనతా యువమోర్చా (BJYM) జాతీయ కార్యవర్గ సభ్యురాలు కసిరెడ్డి సింధూరెడ్డి మహారాష్ట్రకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర యువమోర్చా నాయకులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. జాతీయ పార్టీ అప్పగించిన బాధ్యతల్లో భాగంగా ఆమె మహారాష్ట్రలో యువ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.






