లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఫ్రెష్ టిఫిన్స్ ప్రారంభం

శేరిలింగంపల్లి, అక్టోబర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో, బృందావనం కాలనీ మెయిన్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెష్ టిఫిన్స్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ టిఫిన్ సెంటర్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందిస్తూ వారి ఆదరాభిమానాలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. కొత్తగా ప్రారంభించిన వ్యాపార సంస్థ దినదినాభివృద్ధి చెందాలని, నిర్వాహకులకు మంచి పేరు ప్రఖ్యాతులు లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అనంతరం ఫ్రెష్ టిఫిన్స్ సెంటర్ యాజమాన్యులు సంపత్, మల్లికార్జున్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు కే. ఎల్లేష్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ఎస్‌ఎల్‌వీడీసీ అధ్యక్షుడు రవి యాదవ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ దేవులపల్లి, కిషోర్, ప్రదీప్, కిరణ్ యాదవ్, ముక్రమ్, సమీర్, అజార్, షైబాజ్, దావుడ్, కుమార్, రేవంత్, భరత్ గౌడ్, హరీష్, మల్లేష్, రఘు, మహేష్, విజయ్, నాందేవ్, సురేష్ తదితర స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here