క‌సిరెడ్డి సింధురెడ్డికి ర‌వికుమార్ యాద‌వ్ అభినంద‌న‌లు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారతీయ జనతా యువమోర్చా (BJYM) జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా నియమితులైన కసిరెడ్డి సింధురెడ్డి గురువారం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను ర‌వికుమార్ యాద‌వ్‌ శాలువాతో సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

పార్టీ బలోపేతానికి, యువత సంక్షేమానికి కసిరెడ్డి సింధురెడ్డి చేస్తున్న కృషి మరింత ముందుకు సాగాలని ర‌వికుమార్ యాద‌వ్‌ ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో ఆమెకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, యువత అభ్యున్నతికి మరిన్ని సేవలందించాలని శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here