శేరిలింగంపల్లి, అక్టోబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 22న సాయంత్రం 4 గంటల సమయంలో COD జంక్షన్ ఎదురుగా, పిల్లర్ నంబర్ 1739 సమీపంలో సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తిగా భావిస్తున్నారు. అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే మృతికి గల కచ్చితమైన కారణాలు నిర్ధారణ కావాల్సి ఉంది. మృతుడి వివరాలు తెలిసినవారు లేదా అతని కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిసినవారు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.






