శేరిలింగంపల్లి, అక్టోబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా యువ మోర్చా (BJYM) రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన నక్కా శివకుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తానని తెలిపారు.
తనను నమ్మి బాధ్యతలు అప్పగించినందుకు రంగారెడ్డి జిల్లా యువ మోర్చా అధ్యక్షులు సాయిరాం గౌడ్, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వానేపల్లి శ్రీనివాస్ రెడ్డి లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.





