మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట, మాదాపూర్ డివిజన్ల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ గురువారం జోనల్ కమిషనర్ రవి కిరణ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి కిరణ్‌తో కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ఆయా డివిజన్లలో పెండింగ్‌లో ఉన్న పనులపై చర్చించారు.
హఫీజ్‌పేట, మాదాపూర్ డివిజన్లలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ కోరారు. అలాగే నూతనంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు జోనల్ కమిషనర్ రవి కిరణ్ సానుకూలంగా స్పందించారు.