ఆల్విన్ కాల‌నీ డివిజ‌న్ ఖాజాన‌గ‌ర్‌లో కార్పొరేట‌ర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ బస్తీ బాట

ఆల్విన్ కాల‌నీ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్ర‌జ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య ఉన్నా త‌న దృష్టికి తీసుకువ‌స్తే వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని ఆల్విన్ కాల‌నీ డివిజ‌న్ కార్పొరేట‌ర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. గురువారం ఆయ‌న డివిజ‌న్ ప‌రిధిలోని ఖాజా నగర్ లో కాల్ మీ సమస్యలపై బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కాలనీలో నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

మ్యాన్ హోల్ ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

వృద్ధులకు పెన్షన్లు రేషన్ సకాలంలో అందుతున్నాయా లేదా అనే విషయాన్ని కార్పొరేట‌ర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అడిగి తెలుసుకున్నారు. మ్యాన్ హోల్ మరమ్మతులు, ప్యాచ్ వర్కు ల‌తో ఇబ్బందుల‌కు గుర‌వుతున్నామ‌ని కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు కార్పొరేటర్ స్పందిస్తూ.. కాలనీలో ఉన్న సమస్యలను పది రోజుల్లో పరిష్కరించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

స్థానికుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేట‌ర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, వార్డు సభ్యుడు కాశీనాథ్ యాదవ్, నాయకులు పోశెట్టి గౌడ్ రాములు గౌడ్, నాగభూషణం, కాలనీవాసులు కైసర్, సుల్తాన్, ఎస్ కే గౌస్, మహమ్మద్, మౌలానా, వాసు, అశోక్, శ్రీను, సైదులు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here