శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): డా. బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ హమీద్ పటేల్ పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ, పేదల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఆ మహోన్నత్తుడు చేసిన కృషి వల్లే వెనుకబడిన వర్గాలు సగర్వంగా ఎదగగలుగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నందు, బసవ రాజు, లక్ష్మి బాయ్, తిరుపతి రెడ్డి, భాస్కర్, వినోద్ యాదవ్, శ్రీను, రవి, గణపతి, రవి శంకర్ నాయక్, జుబెర్, సాగర్ చౌదరి, వెంకటేష్, ఫాజిల్, సాయి కుమార్, చారీ, రాము యాదవ్, బళ్ళు, నయీమ్, అంజయ్య, యాదగిరి యాదవ్, సదరామ్, రమేష్, కుమార్, లడ్డు తదితరులు పాల్గొన్నారు.