ప‌తంజ‌లి యోగా గురువుల‌కు స‌ర్టిఫికెట్ల ప్ర‌దానం

శేరిలింగంపల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి‌): పతంజలి ఉచిత యోగా శిబిరం ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ ప‌రిధిలోని గుల్‌మోహర్ పార్క్ లో శిక్షక్ జి వెంకటేష్ ఆధ్వర్యంలో యోగా గురువులకు సర్టిఫికెట్ల‌ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పతంజలి యోగా భారత్ స్వాభిమాన్ హైదరాబాద్ అధ్యక్షుడు గోపాల్, జి రాజేందర్, రంగారెడ్డి జిల్లా యోగా గురువు నూనె సురేందర్ లు హాజ‌రై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి రోజు యోగాను తప్పనిసరిగా చేయాలన్నారు. గుల్‌మోహర్ పార్క్ కాలనీ అధ్యక్షుడు షేక్ ఖాసీం, నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ లు మాట్లాడుతూ ప్రజలందరూ ప్రతిరోజు ఉదయం ఒక గంటపాటు యోగా చేయడం వ‌ల్ల‌ ఆరోగ్యంగా ఉంటార‌న్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా అందరికీ ఉచిత యోగా శిక్షణ అందిస్తున్న జి వెంకటేష్ ని ఘనంగా సన్మానించారు. ఆయ‌న‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా యోగా గురువుల‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్ర‌ధాన కార్యదర్శి నిరంజన్ రెడ్డి, కాలనీ ఉపాధ్యక్షుడు మోహన్ రావు, బిల్డర్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, టి కుమార్ ముదిరాజ్, యోగా గురువులు, యోగా శిక్షకులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

యోగా గురువుల‌కు స‌ర్టిఫికెట్ల‌ను ప్ర‌దానం చేస్తున్న దృశ్యం
కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథులు, యోగా గురువులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here