శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన హేమంత్ భోర్కడేని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కడేతో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై జోనల్ కమిషనర్ తో చర్చించారు. గచ్చిబౌలి డివిజన్ ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, అసంపూర్ణంగా ఉన్న పనులను తక్షణమే పునఃప్రారంభించి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించాలని కమిషనర్ ని కోరారు. ముఖ్యంగా చెరువుల అభివృద్ధి, పార్కుల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు వంటి అంశాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు మెరుగుపరచడంలో సమన్వయంతో పనిచేయాలని కోరుతూ, అభివృద్ధి పట్ల సంకల్పంతో ముందుకెళ్లే దిశగా కమిషనర్ తో పరస్పర సహకారం కొనసాగించాలని పేర్కొన్నారు.