కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి ఘన సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి గచ్చిబౌలి డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తామని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల కమ్యూనిటీ హాల్ లో ఆదివారం కాలనీ అభివృద్ధికి కృషి చేసిన సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి నల్లగండ్ల కాలనీ సభ్యులు సన్మానించారు. కాలనీలో రూ. కోటి 35 లక్షలతో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీరు నిలవకుండా సాఫీగా వెళ్లేందుకు పైప్ లైన్ పూర్తి చేసినందుకు స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలో మిగతా ప్రాంతాల్లో మిగిలిన సీసి రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, పూర్తి చేయాలని కార్పొరేటర్ ను కోరారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నల్లగండ్ల కాలనీ లో ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు విష్ణువర్ధన్ రెడ్డి, గిరి, మల్లేష్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణా రెడ్డి, రామచంద్రా రెడ్డి, రఘుపతి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సురేందర్, శివ గౌడ్, నరేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, ప్రవీణ్ ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ ముదిరాజ్, మున్నూరు సాయి ,కృష్ణ, శంకరయ్య, విజయ్ భాస్కర్ రెడ్డి, రాంచందర్ రెడ్డి, ప్రకాష్, మన్నే రమేష్, నర్సింగ్ రావు పాల్గొన్నారు.

కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని సన్మానిస్తున్న నల్లగండ్ల కాలనీ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here