నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో అమలవుతున్న లా అండ్ ఆర్డర్, రాజకీయాల గురించి మాతృ శ్రీ నగర్ కు చెందిన పలువురు చిన్నారులు పరివర్తన్ పరివార్ సహకారంతో క్షేత్ర స్థాయికి వెళ్లి తెలుసుకున్నారు. మాతృశ్రీ నగర్ కాలనీకి చెందిన పిల్లలు ఆదివారం లా అండ్ ఆర్డర్ మియాపూర్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. పోలీస్ స్టేషన్లలో పాటిస్తున్న నియమ నిబంధనలు, ప్రజల శాంతి భద్రతలు, ట్రాఫిక్ రూల్స్ తదితర అంశాలపై అవగాహన పొందారు. ఎమ్మెల్యేగా నియోజవర్గంలో ప్రజా సేవ విధానం, తదితర అంశాలపై తెలుసుకున్నారు. సమాజంలో పౌరులకు చేస్తున్న నిస్వార్థ సేవలకు చిన్నారులు పోలీసులకు గులాబీ పూలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారులకు సహకరించిన వారిలో మియాపూర్ ట్రాఫిక్ ఎస్ హెచ్ ఓ సుమన్, ఎస్ ఐ రవికిరణ్ తదితరులు ఉన్నారు.