శేరిలింగంపల్లి, ఏప్రిల్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశ్వర కాలనీలో ఉన్న శ్రీ పోచమ్మ సహిత దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం నాలుగవ వార్షికోత్సవం కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పోచమ్మ సహిత దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయ నాలుగవ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు. అపారమైన అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మనసారా ఆ దేవతలను ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ వాసులు బాపిరెడ్డి, ఉదయ్ బాబు, గంగారావు, నాగేశ్వర రావు, ప్రభాకర్ చారి, నాయకులు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






