శేరిలింగంపల్లి అభివృద్ధి కోసం నిరంతరం కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి ఎన్‌క్లేవ్ కాలనీ నుండి బొల్లారం మెయిన్ రోడ్డు వరకు రూ 1 కోటి 50 లక్షల అంచనావ్యయంతో నూతనంగా నిర్మాణం చేపట్టబోయే వరద నీటి కాలువ నిర్మాణం పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఇంజనీరింగ్ విభాగం, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా వరద నీటి కాలువ‌ నిర్మాణం పనులను చేపట్టడం జరిగింద‌ని అన్నారు. ఇంజనీరింగ్ విభాగం, జలమండలి అధికారులు కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వరద నీటి కాలువ‌ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు GM శ్రీనివాస్ రెడ్డి, DGM శరత్ రెడ్డి, మేనేజర్ సునీత , ఇంజనీరింగ్ విభాగం అధికారులు AE సంతోష్, వర్క్ ఇన్స్పెక్టర్ నవీన్ , ఎలక్ట్రికల్ AE రవిచంద్ర, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here