శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం నల్లగండ్ల అపర్ణ సైబర్ జోన్ లో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూ వేలం పాటలో రూ.3.20 లక్షలకు లడ్డూను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బొల్లంపల్లి విజయ్ భాస్కర్ రెడ్డి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలం పాటలో గణేష్ లడ్డూ దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆ విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.






