రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్‌లో ఏర్పాటు చేస్తున్న వైన్‌షాప్‌ను తొల‌గించాలి: కాల‌నీవాసుల విన‌తి

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని కొండాపూర్ రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్‌లో అక్ర‌మంగా నిర్మిస్తున్న వైన్ షాప్‌ను వెంట‌నే తొల‌గించాల‌ని కోరుతూ కాల‌నీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ స‌భ్యులు జోన‌ల్ క‌మిష‌న‌ర్ హేమంత్ బొర్ఖ‌డెకు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా కాల‌నీవాసులు మాట్లాడుతూ త‌మ కాల‌నీలో ఉన్న ఖాళీ స్థ‌లంలో బ‌గ్గ వైన్స్ వారు అక్ర‌మంగా వైన్ షాప్‌ను నిర్మిస్తున్నార‌ని అన్నారు. భ‌వ‌న నిర్మాణ ప్ర‌మాణాలు, నియంత్ర‌ణ‌, క‌నీస జాగ్ర‌త్త‌లు లేకుండా అక్ర‌మంగా వైన్ షాప్ కోసం నిర్మాణం చేప‌ట్టార‌ని అన్నారు. జ‌నావాసాల మ‌ధ్య‌లో వైన్ షాప్ ఏర్పాటు చేయ‌డం నిబంధ‌న‌ల ప్ర‌కారం విరుద్ధ‌మ‌ని అన్నారు. వారికి వైన్ షాప్ ఏర్పాటుకు ఎలాంటి అనుమ‌తులు ఉన్నాయో ముందుగా త‌నిఖీ చేయాల‌ని, వెంట‌నే నిర్మాణాన్ని నిలిపివేయ‌డంతోపాటు ఇప్ప‌టికే పూర్తి చేసిన నిర్మాణాన్ని తొల‌గించాల‌ని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here