అత్య‌వ‌స‌రం ఉన్న చోట ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త‌గా ప‌నుల పూర్తి: కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో ఉన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై GHMC ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగం, హార్టికల్చర్ విభాగం, GHMC స్ట్రీట్ లైట్, జలమండలి అధికారులతో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ వాసులతో కలిసి కాలనీలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పాదయాత్ర చేప‌ట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు అన్ని విభాగాలతో కలసి కాలనీలో పర్యటించి ప్రతి చిన్న సమస్య గురించి చర్చించి వెంటనే సమస్యలు పరిష్కారం జరిగేలా చూడాలని అధికారులకు చెప్పారు. పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, త‌మ‌ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణన‌లోకి తీసుకొని ప్రత్యేక చొరవతో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, స్ట్రీట్ లైట్ సుధాకర్, హార్టికల్చర్ దాసు, జలమండలి వర్క్ ఇన్స్పెక్టర్ నాగరాజు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here