శేరిలింగంపల్లి, డిసెంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ట్రాఫిక్ సీఐ ప్రశాంత్ తెలిపారు. కూకట్‌పల్లి ట్రాఫిక్ ఏసీపీ వెంకటయ్య ఆధ్వర్యంలో మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్‌డీఎఫ్‌సీ హైటెన్షన్ లైన్ నుంచి నడిగడ్డ తండా రోడ్డు వరకు రహదారికి ఇరువైపులా వెలసిన ఫుట్‌పాత్, రోడ్డు ఆక్రమణలను జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయంతో మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ఈ సందర్భంగా సీఐ ప్రశాంత్ మాట్లాడుతూ పౌరులు ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా చూడాలని, ట్రాఫిక్ సజావుగా సాగేందుకు సహకరించాలని అన్నారు.






