ఉప్పలపాటి శ్రీకాంత్ కి కాల‌నీ వాసుల అభినంద‌న‌లు

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ వాసులు, అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీల వాసులు మాజీ కార్పొరేట‌ర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయ‌న నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినంద‌న‌లు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీల వాసులు మాట్లాడుతూ.. డివిజన్ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజల సమస్యల పరిష్కారంలో శ్రీకాంత్ చూపిన చొరవ, అంకితభావాన్ని కొనియాడారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందించిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు. అనంతరం ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి సహకరించిన మియాపూర్ డివిజన్ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, కాలనీల వాసులకు, కాలనీల అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బండారు మోహన్ ముదిరాజ్, వినయ్ ముదిరాజ్, అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీవాసులు, న్యూ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here