శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 18 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి శేరిలింగంపల్లి యువ నాయకుడు, BRS పార్టీ సీనియర్ నేత చిర్రా రవీందర్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్ జన్మదినం సందర్బంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఆయనను ప్రత్యేకంగా కలిసిన చిర్రా రవీందర్ యాదవ్.. హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కెసిఆర్ కి జన్మదినం సందర్బంగా పూరీ తీరాన చిర్రా రవీందర్ యాదవ్ ఏర్పాటు చేసిన జన్మదిన సైకత శిల్పం వీడియోను చూపించారు. సైకత శిల్పం బాగుందని చిర్రా రవీందర్ యాదవ్ ను కెసిఆర్ కొనియాడారు. శేరిలింగంపల్లిలో, రాష్ట్ర వ్యాప్తంగా రవీందర్ యాదవ్ చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని కితాబు ఇచ్చారు.

అనంతరం కెసిఆర్ కి చిర్రా రవీందర్ యాదవ్ సైకత శిల్పంతో కూడిన ప్రతిమను అందించారు. పూరీ తీరాన గీసిన సైకత శిల్పం చిత్రంను చూసిన కెసిఆర్ బాగుంది అంటూ మెచ్చుకున్నారు. కెసిఆర్ జన్మదినం సందర్బంగా.. ఒడిశా రాష్ట్రంలోని పూరీ తీరంలో గులాబీ అధినేత సైకత శిల్పంను చిర్రా రవీందర్ యాదవ్ ఏర్పాటు చేయించారు. అక్కడ జన్మదిన వేడుకలను నిర్వహించారు. అలాగే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంపై చిర్రా రవీందర్ యాదవ్ పై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్బంగా చిర్రా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. కెసిఆర్ ముమ్మాటికీ తెలంగాణ జాతిపిత అని స్పష్టం చేశారు. కెసిఆర్ నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకంలో హైదరాబాద్ లో వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.





