శేరిలింగంపల్లి, నవంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని భూదేవిహిల్స్ కాలనీలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ కె. చెన్నయ్య, కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకలకు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీలో ఉన్న నాభిశిల(బొడ్రాయి) వద్ద సీఎం రేవంత్ రెడ్డి పేరిట ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, రాందాస్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, పోశెట్టిగౌడ్, సుండు యాదగిరి, సత్యనారాయణ, స్వామి, నరేందర్ రెడ్డి, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






